: మల్లన్నసాగర్ ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరిన న్యాయవాదులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట
మల్లన్నసాగర్ భూనిర్వాసితులను పరామర్శించేందుకు, అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ గన్‌పార్క్‌నుంచి ర్యాలీగా వెళ్లిన న్యాయవాదుల జేఏసీ నేతలని పోలీసులు మెదక్ జిల్లా ఒంటిమామిడి వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో తాము ముంపు ప్రాంతాల్లో పర్యటించే తీరుతామని న్యాయవాదులు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు-న్యాయవాదుల జేసీసీకి మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగాయి. ఆగ్రహించిన న్యాయవాదులు అక్కడి రహదారిపైనే బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. న్యాయంగా తాము మల్లన్నసాగర్ కి వెళుతోంటే అడ్డుకోవడమేంటని వారు మండిపడ్డారు. న్యాయవాదులు రోడ్డుపై వాహనాలను అడ్డుకొనే క్రమంలో ఆ రహదారిపై వెళుతోన్న ఎమ్మెల్సీ భానుప్రకాశ్ కారు ఓ న్యాయవాదిని ఢీ కొట్టింది. దీంతో న్యాయవాదికి గాయాలయ్యాయి.