: సమావేశానికి రండి!... టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సందేశం!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రంలోని బీజేపీ సర్కారు తేల్చిచెప్పిన నేపథ్యంలో టీడీపీ డైలమాలో పడిపోయింది. నిన్న రాజ్యసభలో జరిగిన పరిణామాలపై నేటి ఉదయం సమీక్ష చేసిన చంద్రబాబు పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ భేటీని నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన అందరు ఎంపీలు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రేపటి భేటీలో రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితరాలపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి సాగుదామా? వద్దా? అన్న విషయంపైనా చంద్రబాబు ఎంపీల అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.