: ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోనిది!: ఏపీ మంత్రి కామినేని కామెంట్


ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకునే విషయంలో బీజేపీ సఫలీకృతమైన నేపథ్యంలో ఆ పార్టీపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి ఉదయం కడప జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ నేత, ఏపీ కేబినెట్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ మీడియా ముందు నోరు విప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం కేంద్ర పరిధిలోనిదన్న ఆయన, ఈ విషయంపై కేంద్రమే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఏపీకి అన్ని విధాల న్యాయం చేసేందుకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్, వైసీపీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News