: కశ్మీర్లో చొరబాటుకు ఉగ్రవాదుల విఫలయత్నం
ఈరోజు ఉదయం కశ్మీర్లో చొరబాటుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. కశ్మీర్లోని నియంత్రణ రేఖ నుంచి దేశంలోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. మరికొంత మంది ఉగ్రవాదులను హతం చేసేందుకు బలగాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి.