: బ్యాంకు స్కామ్‌ల సుజనాచౌదరి ఏపీకి ద్రోహం చేస్తున్నారు: ‘హోదా’ అంశంపై హీరో శివాజీ
కేంద్రప్రభుత్వం నుంచి మరోసారి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై సానుకూల ప్రకటన రాకపోవడంతో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, తెలుగు సినీ హీరో శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తెలుగు దేశం పార్టీ మంత్రులు తక్షణం వైదొలగాలని ఆయన సూచించారు. ‘బ్యాంకు స్కామ్‌ల సుజనాచౌదరి బీజేపీకి వత్తాసు పలికి ఏపీకి ద్రోహం చేస్తున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. సుజనాతో మరో ఇద్దరు తెలుగు వారు ఢిల్లీలో కూర్చొని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సుజనా నుంచి వచ్చే ఒత్తిడికి లొంగకుండా చంద్రబాబు కేంద్రం నుంచి వైదొలిగే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పట్ల కేంద్రం వహిస్తోన్న తీరు సరికాదని ఆయన అన్నారు.