: ఎల్లలు దాటిన ఎంసెట్-2 లీక్ వ్యవహారం!... ముంబై, బెంగళూరు కేంద్రంగా దందా!


తెలుగు రాష్ట్రాల విద్యార్థులను షాక్ కు గురి చేసిన తెలంగాణ ఎంసెట్- 2 వ్యవహారం తెలంగాణ సరిహద్దులు దాటేసింది. ఇప్పటికే ఈ పరీక్షను రద్దు చేసి మరో దఫా పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో లీకేజీ కీలక నిందితుడి కోసం ముమ్మర గాలింపు జరుపుతున్న పోలీసులు నమ్మలేని వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. ప్రశ్నాపత్రం ముద్రితమైన ఢిల్లీలోని కపూర్ ప్రింటర్స్ నుంచే లీక్ వ్యవహారం మొదలు కాగా... గుట్టుచప్పుడు కాకుండా దందా సాగించేందుకు లీకు వీరులు ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, పుణే, చెన్నైలను కేంద్రాలుగా చేసుకున్నారు. లీకు వ్యవహారంలో చక్కం తిప్పిన ముగ్గురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో లీకు వీరుడిగా భావిస్తున్న రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణను తమదైన శైలిలో విచారించిన పోలీసులు కొత్త విషయాలను వెలికితీశారు. ఇక పరారీలో ఉన్న నిందితుల కోసం తెలంగాణ సీఐడీ అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News