: ఎంత గింజుకున్నా... అనుబంధ బ్యాంకుల విలీనం తప్పదు!: తేల్చి చెప్పిన ఎస్బీఐ చైర్ పర్సన్
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో దాని అనుబంధ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ నిన్న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది సమ్మెకు దిగారు. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి స్వస్తి చెప్పాలని ఉద్యోగులు గొంతెత్తారు. అయితే ఓ వైపు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె హోరును వినిపించగా, మరో వైపు ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య నిన్న ఢిల్లీలో కీలక ప్రకటన చేశారు. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం ఆగబోదని ఆమె తేల్చిచెప్పారు. ఉద్యోగులు ఎంత గింజుకున్నా కూడా తమ పని తాము చేసుకునిపోతామని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అర్థం చేసుకుని అనవసర సమ్మెలు మానుకుని బుద్ధిగా పనిచేసుకోవాలని ఆమె ఉద్యోగులకు సూచించారు.