: వర్షపు నీటిలో పడిపోయిన కడప మునిసిపల్ కమిషనర్!... చేయిచాచి లిఫ్ట్ ఇచ్చిన మంత్రి గంటా!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా నిన్న రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. రాయలసీమలో ప్రత్యేకించి కడప, చిత్తూరు జిల్లాల్లో వరుణ దేవుడు ప్రతాపం చూపాడు. కడప నగరంలో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే నిన్న ఏపీ సర్కారు నిర్వహించిన ‘వనం... మనం’ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు టీడీపీ సీనియర్ నేత, ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా ఇంచార్జీ మంత్రిగా కడపలో అడుగుపెట్టారు. అప్పటికే జోరు వాన కురుస్తుండగా, నగరంలో పరిస్థితిని పరిశీలించేందుకు ఆయన అధికారులతో కలిసి వర్షపు నీటిలోనే బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన వెంట వెళుతున్న కడప మునిసిపల్ కమిషనర్ వర్షపు నీటిలో పడిపోయారు. వర్షపు నీటిలో అడుగు తడబడ్డ కమిషనర్ నడుము లోతు నీటిలో చిక్కుకుపోయారు. ఈ సమయంలో ఆ పక్కగానే వెళుతున్న మంత్రి గంటా వేగంగా స్పందించారు. పరిస్థితిని వేగంగా అంచనా వేసిన గంటా కమిషనర్ కు చేయిచ్చి పైకి లేపారు.