: లాభాల్లో సత్తా చాటిన హెరిటేజ్ ఫుడ్స్!... తొలి త్రైమాసికంలో 54 శాతం వృద్ధి నమోదు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ లాభాల్లో దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెరిటేజ్... 2016-17 ఆర్థిక సంవత్సరంలో జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంలో నికర లాభంలో ఏకంగా 54 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్- జూన్ కాలంలో మొత్తం ఆదాయాన్ని రూ.634.22 కోట్లుగా ప్రకటించిన హెరిటేజ్... రూ.16.52 నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆ సంస్థ రూ.578.42 కోట్ల రాబడిపై రూ. 10.71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సంస్థ నికర లాభం 54 శాతం మేర పెరిగినట్లైంది.