: రంగారెడ్డి జిల్లాలో విషాదం!... రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!
హైదరాబాదు శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం అంకుశాపూర్ లో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకెళితే... ఆదిలాబాదు జిల్లా హౌసింగ్ డీఈగా పనిచేస్తున్న పత్యనారాయన(55), తన భార్య వీరా (51), కూతుళ్లు స్వాతి (33), నీలిమ (25), కుమారుడు శివరామకృష్ణ (22)తో కలిసి నేటి ఉదయం అంకుశాపూర్ రైలు పట్టాలపై విగత జీవులుగా కనిపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయిన వైనం అక్కడి వారిని కలచివేసింది. సత్యనారాయణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.