: బెజవాడలో హైటెన్షన్!... వైఎస్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు, అడ్డుకున్న వైసీపీ!
ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో నిన్న రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని పోలీస్ కంట్రోల్ సమీపంలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోడ్డు విస్తరణలో భాగంగానే వైఎస్ విగ్రహాన్ని తొలగించామని అధికారులు చెబుతుండగా, ఉద్దేశపూర్వకంగానే వైఎస్ విగ్రహాన్ని తొలగిస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు.