: సార్క్ సమావేశాలే ఎజెండా!... పాక్ తో చర్చల్లేవ్!: రాజ్ నాథ్ పాక్ పర్యటనపై విదేశాంగ శాఖ ప్రకటన


కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్వరలో పాకిస్థాన్ లో జరపనున్న పర్యటనకు సంబంధించి విదేశాంగ శాఖ నిన్న ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. సార్క్ దేశాల సదస్సు కోసం పాక్ వెళుతున్న రాజ్ నాథ్... పాక్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ తో చర్చలు జరపనున్నారని, పఠాన్ కోట్ ఉగ్రదాడి, బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ పై పాక్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే కేవలం సార్క్ సమావేశాల కోసం మాత్రమే రాజ్ నాథ్ ఇస్లామాబాద్ వెళుతున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ నిన్న ట్విట్టర్ ద్వారా తెలిపారు. సార్క్ సదస్సు కోసం పాక్ వెళుతున్న రాజ్ నాథ్... ఆ దేశంతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరపబోరని స్వరూప్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News