: ప్రత్యేకహోదాపై బీజేపీ తీరుకు నిరసనగా ఆగస్టు 2న ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని రాజ్యసభ సాక్షిగా తేలిపోవడంపై వైఎస్సార్సీపీ మండిపడింది. దీంతో ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంపై ఏపీ బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను బుగ్గిపాలు చేస్తున్నందుకు నిరసనగా, బీజేపీ వైఖరిని ఎండగడుతూ ఆగస్ట్ 2న (మంగళవారం) రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు జగన్ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని కోరుకునే ప్రతి పౌరుడూ ఈ బంద్ లో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. కాగా, రాష్ట్రానికి హోదా హామీ ఇవ్వలేమని... అంతకంటే ఎక్కువే చేస్తామని అరుణ్ జైట్లీ తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ భగ్గుమంటోంది.

  • Loading...

More Telugu News