: 'టైమ్స్ నౌ'పై 500 కోట్లకు పరువు నష్టం దావా వేసిన జకీర్ నాయక్


వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ 'టైమ్స్ నౌ' ఛానెల్‌ పై 500 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. టౌమ్స్ నౌ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి తన ప్రతిష్టకు భంగం కలిగేలా, విద్వేషం రెచ్చగొట్టేలా వార్తలు ప్రసారం చేశారని పేర్కొంటూ జకీర్ నాయక్ తన న్యాయవాది ముబిన్ సోల్కర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు. టైమ్స్‌ నౌ తో పాటు మరో పది మీడియా సంస్థలపై కూడా ఆయన పరువు నష్టం దావా వేయడం విశేషం. ఇటీవల ఢాకాలో ఉగ్రదాడి చేసిన వారిలో ఓ ఉగ్రవాది జకీర్ నాయక్ ప్రసంగాల వల్ల ప్రభావితమైనట్టు బంగ్లా దేశ్ పోలీసు దర్యాప్తులో తేలడంతో అర్నబ్ గోస్వామి డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్ లో పూర్తి ఆధారాలు సేకరించకుండానే అర్నబ్ తన ప్రతిష్టను దెబ్బతీశారని జకీర్ ఆరోపించారు. ఈ ప్రసారాల్లో చేసిన ఆరోపణలు ఉపసంహరించుకుని, తనకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో 500 కోట్ల రూపాయలు పరువు నష్టం కింది చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News