: రాజ్యసభలో పార్టీ ఎంపీల తీరుపై మండిపడ్డ చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలోని పార్టీ ఎంపీలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్ లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై జరిగిన చర్చను సానుకూలంగా మలచుకోలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రత్యేకహోదా, ఆర్థిక సమస్యలపై మరింత సమగ్రంగా చర్చించాల్సిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలిచిన వేళ కేవలం మీరు ఎందుకు విఫలమయ్యారని ఆయన వారిని నిలదీశారు. కాగా, ఏపీకి ప్రత్యేకహోదా, రాజ్యసభలో జరిగిన చర్చపై తన అభిప్రాయాన్ని సీఎం కాసేపట్లో మీడియా ముఖంగా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News