: ‘హోదా’పై స్పష్టత ఇవ్వలేదు.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు: రఘువీరారెడ్డి
ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వని కేంద్ర ఆర్థిక మంత్రి అరున్‌జైట్లీ ప్రసంగం పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగబోదని ఆయన చెప్పారు. కేంద్రం మరోసారి తన ద్రోహపూరిత వైఖరిని ఈరోజు రాజ్యసభలో బయటపెట్టిందని ఆయన అన్నారు. కేంద్రం తీరుకి నిరసనగా, ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని ఉద్ఘాటించారు.