: క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ తో కడియం, లక్ష్మారెడ్డి, డీజీపీ, సీఐడీ చీఫ్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్యాంపు ఆఫీస్ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీఐడీ చీఫ్ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంసెట్-2 పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, తదితర పరిణామాలు, పరీక్ష మరోసారి నిర్వహించడం వంటి అంశాలపై అవలంబించాల్సిన విధానంపై చర్చిస్తున్నారు. రెసెనెన్స్ అకాడమీ పేపర్ లీక్ లో కీలక పాత్ర పోషించిందని సీఐడీ అధికారులు తెలిపారు. దిల్ షుక్ నగర్, కర్నూలులో ఈ అకాడమీకి కోచింగ్ సెంటర్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో నిందితులపై తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.