: భజ్జీకి సచిన్, గ్యారీ సోబర్స్ కి కోహ్లీ శుభాకాంక్షలు


టీమిండియా స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ తండ్రిగా ప్రమోషన్ పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు చెప్పారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన సచిన్ పుట్టిన పాపాయికి 'కొత్త ప్రపంచానికి స్వాగతం. పాజీ, మమ్మాజీకి శుభాభినందనలు. అమితమైన ప్రేమ, దీవెనలతో' అంటూ సచిన్‌ ట్వీటారు. కాగా, గీతా బస్రా లండన్‌ లోని ఆసుపత్రిలో పండంటి పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ...వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 80వ పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ ద్వారా గ్యారీ ఫీల్డ్ సోబర్స్ కు కోహ్లీ శుభాకాంక్షలు చెప్పిన సందేశాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు రీ ట్వీట్ చేసింది. ఆ సందేశంలో కోహ్లీ 'మైదానంలో మీ క్రీడా ప్రతిభ ఎప్పటికి గుర్తుండిపోయేది. క్రికెట్‌ను కొత్తదారి పట్టించిన అతికొద్ది మందిలో మీరు ఒకరు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. మీ 80వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం నాకు దక్కిన గౌరవం' అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News