: మాయావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో దయాశంకర్ సింగ్‌ని బీహార్ లో అరెస్టు చేసిన పోలీసులు
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ మాజీ నేత దయాశంకర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దయాశంకర్ సింగ్‌ను అరెస్టు చేయాల్సిందేనని బీఎస్పీ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌లో ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాయావతికి క్షమాపణలు కూడా చెప్పారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న సమాచారంతో దయాశంకర్ సింగ్ పోలీసులకి కనిపించకుండా తలదాచుకుంటున్నారు. చివరికి ఆయన ఇటీవల ఝార్ఖండ్‌లోని ఓ ఆలయంలో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. వాటి ఆధారంగా ఆయన ఆచూకీని కనుక్కున్న పోలీసులు బీహార్‌లో ఆయనను అరెస్ట్ చేశారు.