: పవిత్ర గడ్డపై హామీ ఇచ్చారు...దేవుడి మీద నమ్మకం ఉంటే నెరవేర్చండి: మహ్మద్ అలీ ఖాన్


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణకు రాజ్యసభలో ఉన్న ప్రతి పార్టీ అంగీకరించిందని జమ్మూకాశ్మీర్ నేత మహ్మద్ అలీ ఖాన్ గుర్తు చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభలో ఒక ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. దానిమీద గౌరవం లేని పక్షంలో కనీసం వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే పవిత్ర భూమి తిరుపతి సభలో ఇప్పటి ప్రధాని ఇచ్చిన హామీని అయినా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన తెలిపారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, గౌరవం ఉంటే ఏపీకి తక్షణం ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పరిపాలన కోసం రాజకీయాలు చేస్తే...జమ్మూకాశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్నటువంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఆదాయ వనరులు లేక జమ్మూకాశ్మీర్ ఎంత ఇబ్బంది పడుతుందో, నేడు అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News