: రాష్ట్రం ఆర్థికంగా నిల‌దొక్కుకోవాలంటే ‘హోదా’ ఇవ్వాలి: సీతారామ‌ల‌క్ష్మి


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న్యాయం జ‌ర‌గాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యురాలు సీతారామ‌ల‌క్ష్మి అన్నారు. రాజ్య‌స‌భ‌లో కొన‌సాగుతోన్న ఏపీకి ప్ర‌త్యేక హోదా చ‌ర్చ‌పై ఆమె మాట్లాడుతూ.. ప్ర‌పంచానికి తెలియ‌కుండా ఆనాడు స‌భ‌లో త‌లుపులు మూసి రాష్ట్ర విభ‌జ‌న చేశారని, మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు కాదు.. ప‌దేళ్లు కావాల‌ని వెంక‌య్య‌నాయుడు అన్నార‌ని ఆమె గుర్తు చేశారు. ప్ర‌త్యేక హోదా వ‌స్తే ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయని, రాష్ట్రాభివృద్ధి జ‌రుగుతుంద‌ని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా నిల‌దొక్కుకోవాలంటే హోదా ఇవ్వాల్సిందేనని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News