: ర్యాగింగ్ ఎఫెక్ట్!... తెలంగాణలోని బాలాజీ డెంటల్ కాలేజీ సహా 20 కళాశాలల గుర్తింపు రద్దు!
దేశంలోని దంత వైద్య కళాశాల్లో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనలపై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ) కొరడా ఝుళిపించింది. ర్యాగింగ్ భూతాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయడంలో సఫలం కాలేదన్న ఆరోపణలతో దేశంని వివిధ ప్రాంతాలకు చెందిన 20 కళాశాలల గుర్తింపు రద్దుకు డీసీఐ కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపితే... సదరు కళాశాలల గుర్తింపు రద్దైపోయినట్లే. గుర్తింపు రద్దు కానున్న కళాశాలల్లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీ బాలాజీ డెంటల్ కళాశాల కూడా ఉంది.