: 130 మందికి ముందే చేరిన 'ఎంసెట్-2' పేపర్!: సీఐడీ నివేదిక


తెలంగాణలో జరిపిన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీపై సీఐడీ నివేదిక సిద్ధమైంది. డీజీపీ స్వయంగా సీఐడీ రిపోర్టును మంత్రి లక్షారెడ్డికి అందించారు. మొత్తం 130 మందికి పేపర్ ముందే లీకైందని విచారణలో వెల్లడైందని నివేదికలో పొందుపరిచారు. తొలుత ఈ కేసులో ఐదారుగురికి మాత్రమే పేపర్ ముందే తెలిసిపోయిందని చెప్పిన సీఐడీ వర్గాలు, ఆపై సంఖ్యను పెంచుకుంటూ పొయాయి. విచారిస్తున్న కొద్దీ ఆ సంఖ్య 30, 50, 80, 100 దాటిపోయి ఇప్పుడు 130కి పెరగడం గమనార్హం. పేపర్ ను ముందే చూసిన వారి సంఖ్య మరింతగా ఉండవచ్చన్న అనుమానాలూ ఉన్నాయి. కాగా, ఈ నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి పరీక్షను రద్దు చేయాలా? లేక కౌన్సెలింగ్ కు వెళ్లాలా? అన్న విషయమై ప్రకటన చేస్తామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News