: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం... పోలీసులపై కాల్పులు జరిపిన దుండగుడు
అమెరికాలో పోలీసులపై కాల్పులు జరుపుతోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే నల్లజాతీయుల ఆందోళనలో పోలీసులపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా రెండు, మూడు సార్లు పోలీసులపై పలువురు కాల్పులు జరిపి అలజడి సృష్టించారు. తాజాగా ఈరోజు కూడా అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. శాండియాగోలో ఇద్దరు పోలీసులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.