: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హమీలు అమలయ్యేలా చూడండి!... టీడీపీ ఎంపీలకు చంద్రబాబు హితబోధ!


ఏపీకి ప్రత్యేక హోదా కల సాకారమయ్యేలా వ్యవహరించాలని టీడీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హితబోధ చేశారు. నేటి ఉదయం పార్టీ ఎంపీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఆరా తీశారు. బిల్లుపై నిన్న చర్చ, నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరణ నేపథ్యంలో చంద్రబాబు సభలో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా వ్యవహరించాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలే అమలు కాకుంటే ఎలాగన్న రీతిలో ప్రభుత్వంపై విరుచుకుపడి అయినా ప్రత్యేక హోదా సాధించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News