: ఆ సీఎం నుంచి కేసీఆర్ పాఠాలు నేర్చుకుంటున్నారు: దిగ్విజయ్ సింగ్


తెలంగాణలో ఎంసెంట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. వ్యాపమ్ కుంభకోణం వెనుక హస్తం ఉన్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠాలు నేర్చుకుంటున్నారని అన్నారు. ఈమేరకు దిగ్విజయ్ సింగ్ ఒక ట్వీట్ చేశారు. ఎంసెంట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఎంసెట్ 2 మెడికల్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై తెలంగాణలో ప్రతిపక్షాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులు అన్యాయమై పోతున్నారంటూ వారు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News