: లీకు వీరులను శిక్షించండి!... జేఎన్టీయూ వద్ద ఆందోళనకు దిగిన టీఎన్ఎస్ఎఫ్!
తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీకి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేవలం కొద్దిమందికి మాత్రమే లబ్ధి చేకూర్చిన సదరు పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహిస్తే తాము నిండా మునిగిపోతామంటూ పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాదులో ఆందోళనకు దిగారు. అదే సమయంలో పేపర్ లీకేజీకి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ విద్యార్థి విభాగం తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నగరంలోని జేఎన్టీయూ వద్ద ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నిరసనకారులు... లీకేజీకి బాధ్యత వహిస్తూ తెలంగాణ విద్య, వైద్య శాఖ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.