: బీహార్లో పొంగిపొర్లుతోన్న నది... సెల్ఫీలు దిగుతూ యూత్ ఎంజాయ్‌మెంట్
వరదలకు పొంగిపొర్లుతోన్న నది దగ్గర సెల్ఫీలు దిగుతూ యూత్ ఎంజాయ్ చేస్తోన్న సంఘటన బీహార్‌లోని ఖతిహార్‌లో కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. వరదల ధాటికి పలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే, వరదల్లోనూ బీహార్ యువత సెల్ఫీలు దిగారు. పొంగిపొర్లుతోన్న మహానంద నది దగ్గర సెల్ఫీలు దిగుతూ యువత హల్‌చల్ చేశారు. బీహార్‌తో పాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అసోం, కశ్మీర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.