: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 21 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం: పరిటాల సునీత
ఏపీలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 21 పెట్రోల్ బంక్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రెండు బంకులు నడుస్తున్నాయని, వాటిని విస్తరిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో పెట్రోల్ బంకు ఏర్పాటుకు నిన్న ఆమె శంకుస్థాపన చేశారు.