: 'గోల్డెన్ బాబా' కన్వర్ యాత్ర... ఒంటిపై రూ.4 కోట్ల విలువైన ఆభరణాలు
ఒంటి నిండా చాలా విలువైన బంగారు ఆభరణాలు ధరించిన గోల్డెన్ బాబా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో కన్వర్ యాత్ర ప్రారంభించారు. సుమారు రూ.4 కోట్ల విలువైన 12 కిలోల బంగారు ఆభరణాలను ధరించి, ఫార్చ్యూన్ లగ్జరీ వాహనంపై కూర్చుని ఉన్న బాబాకు సాయుధ పోలీసులు గస్తీగా ఉన్నారు. ఈ యాత్రలో ఆయన వెంట కనీసం రెండొందల మంది ప్రజలు, పది మంది అంగరక్షకులు ఉన్నారు. కాగా, గోల్డెన్ బాబా తొలియాత్ర నిర్వహించినప్పుడు ఆయన ఒంటిపై 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించగా, ఈసారి మాత్రం 12 కిలోలు ధరించారు. బంగారు ఆభరణాలు ధరించడం లక్ష్మీదేవి కరుణాకటాక్షాలకు గుర్తు అని బాబా తనదైన శైలిలో చెబుతుంటారని భక్తులు అంటున్నారు.