: ఉగ్రవాదంపై పోరు సాగిస్తా!... అమెరికా శక్తిమంతమైనదే!: హిల్లరీ ప్రకటన
అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన ఆ దేశ మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ కొద్దిసేపటి క్రితం కీలక ప్రసంగం చేశారు. డెమొక్రటిక్ పార్టీ తనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మాట్లాడిన హిల్లరీ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరు సాగిస్తామని ఆమె ప్రకటించారు. అందరితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమేనని కూడా హిల్లరీ ప్రకటించారు. అమెరికా బలహీనమైన దేశమేమీ కాదని పేర్కొన్న హిల్లరీ... అమెరికా అత్యంత శక్తిమంతమైన దేశమేనని ప్రకటించారు.