: నలుగురిని కాల్చి చంపిన ఇండోనేషియా ప్రభుత్వం... ఇప్పటికి గురుదీప్ సింగ్ సేఫ్
తమ దేశంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ చేసి మరణదండన విధించిన ఇండోనేషియా, నలుగురిని తలలోకి తుపాకితో కాల్చి చంపడం ద్వారా శిక్షను అమలు చేసింది. వారి క్షమాభిక్ష పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం సైతం తిరస్కరించడంతో పట్టుబడిన 14 మందికీ మరణశిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా గత అర్ధరాత్రి తరువాత నలుగురికి శిక్ష అమలైంది. అయితే, వారితో పాటే మరణశిక్షకు గురైన ఇండియాకు చెందిన గురుదీప్ సింగ్ కు మాత్రం ఇంకా మరణదండన అమలు చేయలేదు. అతన్ని కాపాడాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నుంచి, ఇండోనేషియాలోని దౌత్యాధికారులంతా అక్కడి ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగానైనా గురుదీప్ శిక్ష అమలు నిలిచింది. కాగా, గత సంవత్సరం ఏప్లిల్ లో ఇదే తరహా డ్రగ్స్ సరఫరా ఆరోపణలపై ఇద్దరు ఆస్ట్రేలియన్లు సహా ఎనిమిది మందికి ఇండోనేషియా ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే.