: అమెరికాకు కాబోయే అధ్యక్షురాలే నా హీరో.. హిల్లరీ కుమార్తె చెల్సియా క్లింటన్


‘అమెరికాకు కాబోయే అధ్యక్షురాలే నా హీరో’ అని హిల్లరీ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఫిలడెల్ఫియాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న చెల్సియా(36) మాట్లాడుతూ తన తల్లి హిల్లరీకి ఓటు వేసి అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని కోరారు. తన తల్లిని చూస్తుంటే తనకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందన్న చెల్సియా తనను అన్ని రకాలుగా ప్రభావితం చేసిన వ్యక్తి ఆమేనని పేర్కొన్నారు. ఆమె కఠిన శ్రమ, కరుణ తనను కదిలిస్తాయన్నారు. తల్లి అండ తనకు ఎప్పుడూ ఉంటుందని ఆమె నొక్కి వక్కాణించారు. ప్రతి ఒక్కరినీ ప్రేమించడం, కరుణ అందించడం తన తల్లి దగ్గరి నుంచే నేర్చుకున్నానని అన్నారు. చెల్సియా తన ప్రసంగంలో ఎక్కడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, తన తల్లి ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ‘‘నాకు తెలుసు. అధ్యక్షురాలిగా ఎన్నిక కాబోతున్న నా తల్లి దేశానికి గర్వకారణంగా నిలవబోతున్నారు’’ అని పేర్కొన్నారు. ‘నా తల్లి, నా హీరో, కాబోయే అమెరికా అధ్యక్షురాలే’ అంటూ ముగించారు.

  • Loading...

More Telugu News