: ఇండోనేషియాలో భారతీయుడికి మరణశిక్ష.. రక్షించేందుకు భారత్ చివరి ప్రయత్నాలు
మాదకద్రవ్యాలతో పట్టుబడి ఇండోనేషియాలో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుడు గుర్దీప్సింగ్ను రక్షించేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2004లో గుర్దీప్ 300 గ్రాముల హెరాయిన్‌తో జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. డ్రగ్స్ కేసులో సింగ్, ఓ మహిళ సహా మొత్తం 14 మందికి అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. విషయం తెలిసిన భారత ప్రభుత్వం గుర్దీప్ను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ ఇండోనేషియా అధ్యక్షుడి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. ఇండోనేషియాలోని తమ దౌత్య అధికారులు అక్కడి అధికారులతో టచ్‌లో ఉన్నారని, అలాగే గుర్దీప్ భార్య, సోదరులను కలిసి మాట్లాడుతున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. సింగ్ విడుదలకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.