: రాయలసీమలో జోరు వాన!... పొంగి పొరలుతున్న వాగులు, వంకలు!


బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఆయా జిల్లాల్లోని ప్రధాన వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కడప జిల్లాలో వర్షం ప్రభావం మరింత అధికంగా ఉంది. జిల్లాలోని బద్వేల్ ఆర్టీసీ గ్యారేజీ పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోయింది. ఇక చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News