: పార్లమెంటులో హల్‌చల్ చేసిన వానరం.. అరగంట పాటు కోతి చేష్టలు!


చట్టసభ్యులందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. చర్చలతో సభ దద్దరిల్లుతోంది. ఈ సమయంలో పార్లమెంటులోకి ప్రవేశించిన ఓ వానరం అరగంట పాటు హడావుడి చేసింది. పార్లమెంటు హౌస్‌లోని లైబ్రరీ, సెంట్రల్ హాల్‌లోకి ప్రవేశించి హల్‌చల్ చేసింది. అనంతరం రీడింగ్ రూంలోకి ప్రవేశించి గ్యాలరీలోని ఎలక్ట్రికల్ వైర్లపైకి ఎక్కి దూకింది. కాసేపు వాటితో ఆటలాడిన తర్వాత కిందికి దిగింది. బయటపడే మార్గం కనిపించక 30 నిమిషాలపాటు అక్కడే చక్కర్లు కొట్టింది. చివరికి మెయిన్ డోర్ ద్వారా గ్రీన్ కార్పెట్‌పై నడుచుకుంటూ దర్జాగా బయటకు వెళ్లింది. కోతి పార్లమెంటులోకి ప్రవేశించిన విషయాన్ని తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే సెంట్రల్ హాల్ తలుపులు మూసేశారు. మంత్రులు, ఎంపీలు, జర్నలిస్టులు, కేటరింగ్ సిబ్బంది అందులోనే ఉండడంతో వానరం వారిపై దాడిచేయకుండా హాల్ తలుపులు మూసేశారు. అయితే ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టకుండానే వానరం అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News