: చావుబతుకుల్లో సరబ్ జిత్.. పాక్ చేరుకున్న కుటుంబ సభ్యులు


పాకిస్తాన్ జైల్లో తోటి ఖైదీల దాడిలో గాయపడి కోమాలోకి వెళ్ళిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ పరిస్థితి మరింత విషమించింది. లాహోర్ లోని జిన్నా ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న సరబ్ జిత్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకా వెంటిలేటర్ మీద కొనసాగుతున్నాడు. కాగా, సరబ్ జిత్ ను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు నేడు వాఘా సరిహద్దు గుండా పాక్ చేరుకున్నారు. జైలు అధికారులే కుట్రపూరితంగా సరబ్ జిత్ ను గాయపరిచారని వారు ఆరోపించారు.

ఇక పాకిస్తాన్ ప్రభుత్వం తన నైజాన్ని మరోసారి చాటుకుంది. తొలుత సరబ్ జిత్ ను చూసేందుకు భారత దౌత్యాధికారులను అనుమతించిన పాక్ సర్కారు తాజాగా మాట మార్చింది. సరబ్ జిత్ ను భారత అధికారులు కలవడం ఇక కుదరదంటూ తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News