: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే: తెలంగాణ ఎంపీ కేకే స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని టీఆర్ఎస్ ఎంపీ కేకే తెలిపారు. రాజ్యసభలో దేనినైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని అన్నారు. మాజీ ప్రధాని చేశారు కనుక తాము చేయమని అనడం సరికాదని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదాలో ఏమేం ఇవ్వాలనుకుంటున్నారో ఒక క్లారిటీకి వచ్చి, ఏపీకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన సందర్భంగా తెలంగాణకు కూడా అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాజ్యసభలో తెలంగాణకు మద్దతుగా ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమ రెండు రాష్ట్రాలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఏపీతో పాటు తమకు కూడా సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు. ప్రస్తుత హైకోర్టును విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. పక్షపాతం వద్దని, రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఏపీకి ప్రత్యేకహోదా అవసరమని ఆయన తెలిపారు.