: పార్టీలు మారుతాయి... ప్రభుత్వ నిర్ణయాలు మాత్రం అమలు జరగాలి: సీపీఐ నేత డి.రాజా
పార్టీలు అధికారంలో ఉంటాయి, అధికారం కోల్పోతాయి... కానీ ప్రభుత్వం మాత్రం ఉంటుందని సీపీఐ నేత డి.రాజా తెలిపారు. ఒక ప్రధాన మంత్రి హామీ ఇచ్చినప్పుడు దానిని ఆ తర్వాత వచ్చిన ప్రధాని నెరవేర్చాలని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ నిర్ణయం ఏంటని ఆయన నిలదీశారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ నోరిప్పడం లేదని ఆయన మండిపడ్డారు. ఏపీకి ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారన్న విషయంపై బీజేపీ ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని చెప్పలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ వైఖరి ఏంటన్నది బీజేపీ స్పష్టం చేయాలని ఆయన సూచించారు. తమ డిమాండ్ అయితే కనుక ఏపీకి ప్రత్యేకహోదా ఈ క్షణమే ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.