: విభజన వల్ల రెండు రాష్ట్రాలూ నష్టపోయాయి... రెండూ ఇబ్బంది పడుతున్నాయి!: బిజూ జనతాదళ్


స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మళ్లీ ముక్కలవడం దారుణమని బిజూ జనతాదళ్ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన వల్ల రెండు రాష్ట్రాలు నష్టపోయాయని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఏపీలో ప్రజలు ప్రత్యేకహోదా కోసం పోరాడుతుంటే... తెలంగాణ ప్రజలు హైకోర్టు కోసం పోరాడుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రెండు రాష్ట్రాలకు సమస్యల పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆ రెండు రాష్ట్రాల కష్టాలు ఇలా ఉంటే... పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను కలుపుకుని ఏర్పడిన ఒడిశా పరిస్థితి కూడా దారుణంగానే ఉందని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలిపిన ఆయన, ఒడిశాకు కూడా ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేశారు. భారత దేశంలో ఏ నివేదిక చూసినా ఒడిశా వెనుకబడి ఉందని చెబుతుందని, అలాంటప్పుడు ఒడిశా సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News