: అన్నీ పార్టీలకు ధన్యవాదాలు...అన్యాయాన్ని సరిచేయమంటున్నా: సీఎం రమేష్


ఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రత్యేకహోదాకు మద్దతు పలుకుతున్న ప్రతి పార్టీకి ధన్యవాదాలని సీఎం రమేష్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, సుమారు ఆరు నెలలపాటు ఏపీకి అన్యాయం జరుగుతోందని తాము ఆందోళన చేశామని గుర్తు చేశామన్నారు. ఆదాయ వనరుల్లో వ్యత్యాసం వస్తోందని, న్యాయం చేయాలని తాము అడిగామని అన్నారు. తొలి సంవత్సరం 16,200 కోట్లు ఇస్తామన్నారు. తరువాత ప్లానింగ్ కమీషన్ నిర్ణయిస్తుందన్నారు. తరువాత ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే బాగుంటుందని అంతా చెబుతున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తేనే బిల్లుకు అంగీకరిస్తామని బీజేపీ చెప్పిందని అన్నారు. ఆరోజు వెంకయ్యనాయుడు అలా డిమాండ్ చేయడం వల్లే ఈ రోజు చర్చ జరుగుతోందని ఆయన చెప్పారు. ఇప్పుడంతా వెంకయ్యనాయుడు ఎక్కడ? ప్రత్యేకహోదా ఎక్కడ? అని అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశామని, ప్రజలు తమ కూటమికి మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో తిరుపతిలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని, బ్రహ్మండమైన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన ఏడు మండలాలను కలపాలని చంద్రబాబు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ వద్దకు వెళ్తే...వెంకయ్యనాయుడు ఆ ఫైల్ తీసుకుని రాష్ట్రపతి వద్దకు వెళ్లి, దానిని ఆమోదించేలా చేశారని అన్నారు. ఏపీలో కేవలం 21 శాతం అర్భన్ పాపులేషన్ ఉందని, దీంతో ఏపీలో ఆదాయవనరులు లేకుండా పోయాయని ఆయన చెప్పారు. ఏపీకి పర్ క్యాపిటల్ ఆదాయం లేదని ఆయన తెలిపారు. బీజేపీపై నమ్మకం ఉందని, స్పెషల్ స్టేటస్ కావాలని అంతా కోరుకుంటున్నారని, ఏపీకి ప్రత్యేకహోదా కావాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News