: ప్రధాని ఎవరైనా సరే... ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చాలి: జేడీయూ సభ్యుడు అలీ అన్వర్ అన్సారీ
సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే బీహార్ ను నాశనం చేశారని జేడీయూ ఎంపీ అలీ అన్వర్ అన్సారీ అన్నారు. ఏపీ ప్రత్యేకహోదాపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సాక్షిగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని అన్నారు. ఆరోజు ప్రధాని ఏపీకి పలు సౌకర్యాలు కల్పిస్తామని మాట ఇచ్చారని అన్నారు. ఆ రోజు సభలో ఉన్న చాలా మంది అందుకు సాక్ష్యంగా నిలిచారని ఆయన గుర్తుచేశారు. ప్రధాని ఇచ్చిన హామీలకు విలువలేకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీలు ఏవైనా సరే ప్రధాని ఇచ్చిన హామీలను నేరవేర్చాలని ఆయన సూచించారు. రాముడి పేరు సభలో చాలా మంది ఎత్తుతుంటారని... అలాంటి వారంతా రాజైన రాముడు దేవుడు ఎలా అయ్యాడు? ఎందుకు అయ్యాడు? అనే విషయాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. సుపరిపాలన ద్వారా రాముడు దేవుడయ్యాడని ఆయన గుర్తు చేశారు. ఆయన తమకు ఆదర్శం అని చెప్పే ప్రతి పార్టీ రామరాజ్యపాలన అందించాలని ఆయన సూచించారు. బీజేపీ అలా అందించాలని, అలా చేయాలని అనుకుంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన తెలిపారు.