: పోలాండ్ లో తూలిపడ్డ పోప్ ఫ్రాన్సిస్
పోలాండ్ పర్యటనలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ తూలి పడ్డారు. అయితే, ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. జెస్టోచోవాలోని క్రైస్తవ సన్యాసులు నివసించే భవనం ‘జాస్నా గోరా’ను పోప్ ఈ రోజు సందర్శించినప్పుడు ఈ సంఘటన జరిగింది. తూలి పడబోయిన పోప్ అక్కడున్న టేబుల్ ను ఆసరా చేసుకుని పైకి లేచి నిలబడ్డారు. ఈ క్రమంలో పోప్ సహాయకులు ఆయనకు సహకరించినట్లు పోలాండ్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. పోప్ కు ఎటువంటి గాయాలు కాలేదని, బాగానే ఉన్నారని ఆ కథనాల్లో పేర్కొంది.