: సంజయ్ దత్ బర్త్ డే పార్టీకి సల్మాన్ ఖాన్ వెళతాడా?
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ రేపు 57వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా తన సినీ మిత్రులందరికీ సంజయ్ గ్రాండ్ పార్టీ కూడా ఇవ్వనున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు కూడా సంజయ్ దత్ ఆహ్వానం పంపాడు. చిరకాల మిత్రులైన సంజయ్, సల్మాన్ ల మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు చోటు చేసుకోవడంతో ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. మరి, సల్లూ భాయ్ ఈ పార్టీకి వెళతాడా? లేదా అనే విషయమై బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.