: స్టేడియంలో అసభ్యంగా ప్రవర్తించిన క్రికెట్ అభిమానికి జైలు, జరిమానా


శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అసభ్యంగా ప్రవర్తించిన ఒక అభిమానికి వారం జైలు శిక్ష, జరిమానా విధించారు. శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఈ నెల 26న ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ కు వర్షం కారణంగా కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా అభిమాని ఒకరు దుస్తులు లేకుండా మైదానంలోకి పరుగులు పెట్టడమే కాకుండా, అక్కడే ఎక్కువ సేపు ఉన్నాడు. ఆ తర్వాత మైదానం నుంచి స్టేడియంలోకి వచ్చిన ఆ అభిమాని దుస్తులు ధరించాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఒక వారం జైలు, రూ.3 వేలు జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు నిచ్చారు.

  • Loading...

More Telugu News