: ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతాదేవి కన్నుమూత
ప్రసిద్ధ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతాదేవి (90) కన్నుమూశారు. సాహిత్యరంగంలో ఎనలేని సేవ చేసిన ఆమె ఈరోజు అనారోగ్యం కారణంగా కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1996లో మహాశ్వేతాదేవికి సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ అవార్డు లభించింది. 1997లో ఆమెను రామన్ మెగసేసే అవార్డు వరించింది. ఆమె సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆమెకు 2006లో దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చింది. ఆమె మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ గొప్ప రచయిత్రిని కోల్పోయిందని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.