: సీఎం వసుంధర రాజే హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ను అత్యవసరంగా దింపివేశారు. జయపుర నుంచి సిరోహి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రతికూల వాతావరణం ఎదురవడంతో రాజ్ సమంద్ జిల్లాలోని 73 పరగణాల గ్రామం వద్ద హెలికాఫ్టర్ ను అత్యవసరంగా దించాల్సి వచ్చిందని జిల్లా కలెక్టర్ అర్చనా సింగ్ తెలిపారు. దీంతో, పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. హెలికాఫ్టర్ దిగిన ప్రాంతానికి వెళ్లి వసుంధర రాజే ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. హెలికాఫ్టర్ లో సీఎం సహా పలువురు అధికారులు ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు మహేంద్ర భరద్వాజ్ తెలిపారు.