: తుని విధ్వంసం కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్
తూర్పుగోదావరి జిల్లా తుని విధ్వంసం కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ఆమోదించింది. తునిలో రైలు విధ్వంసం కేసుతో తనకు సంబంధం లేదని, అయినప్పటికీ తనపై కూడా ప్రభుత్వం కేసు పెట్టిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనపై ఎలాంటి విచారణ నిర్వహించకుండా తప్పుడు కేసు పెట్టిందని, అరెస్టు చేసే అవకాశము ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్... దాడిశెట్టి రాజాకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే, ఈ కేసుతో రాజాకు సంబంధముందంటూ ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఆరోపించారు.