: మహాత్మాగాంధీ హత్య వెనుక ఇటలీ కనెక్షన్... ఆగస్టు 15 తరువాత మొత్తం చెబుతానంటున్న సుబ్రహ్మణ్యస్వామి


బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి మరో సంచలన ఆరోపణ చేశారు. మహాత్మాగాంధీ హత్య వెనుక ఇటలీ కనెక్షన్ ఉందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. 'మహాత్మా గాంధీని ఇటలీ వ్యక్తి స్ఫూర్తితో ఇటలీ నుంచి దిగుమతి చేయబడ్డ తుపాకీతో గాడ్సే కాల్చి చంపాడు. అతను ఎవరు?' అని ట్వీట్ పెట్టిన స్వామి, గాంధీ హత్యపై ఆగస్టు 15 తరువాత ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. గత వారంలో గాంధీ హత్యపై పార్లమెంటులో చర్చను చేపట్టాలని స్వామి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామి తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News