: రానున్న రెండు రోజుల్లో తెలంగాణ, ఏపీలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, మరట్వాడ సహా దానికి ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. తెలంగాణ, ఏపీల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతోనే తెలంగాణ, రాయలసీమల్లో విస్తారంగా, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.